రెన్యూవబుల్ ఎనర్జీకు మారండి

  1. పునర్వినియోగ ఇంధన వనరులు
  2. పునర్వినియోగ విద్యుత్కేంద్రాలు
  3. విధానాలు & RE ప్రోత్సాహక చర్యలు
  4. విద్యుత్ రంగంలో పునర్వినియోగ ఇంధన చట్టం-2003, జాతీయ విద్యుత్ విధానం-2003 మరియు జాతీయ టారిఫ్ పాలసీ
  5. RE ప్రోత్సాహానికి సంస్థలు

స్థిరమైన మరియు పరిశుభ్రమైన శక్తి ఉత్పాదనకోసం సౌరశక్తి, గాలి, మొక్కలు, నీరు వంటి తరగని ప్రాకృతిక వనరులను పునర్వినియోగ ఇంధనంగా వినియోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలు:

  • గ్రీన్ హౌస్ వాయు రహితంగా మరియు వాయు కాలుష్యం తగ్గిస్తూ ఇంధన ఉత్పాదన.
  •  ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని ఇంధన వైవిధ్యం తగ్గిస్తుంది.
  • ఆర్థిక అభివృద్ధి మరియు మ్యాన్ఫ్యాక్చరింగ్, ఇనస్టలేషన్ ఇతరత్రా ఉద్యోగాలు.

పునర్వినియోగ ఇంధన వనరులు

సౌరశక్తిఅనేది సూర్య కాంతిని వినియోగించుకుని చేసే విద్యుచ్ఛక్తి. దీనిని వేడి పుట్టించడానికి, నీళ్లను మరిగించడానికి, చల్లబరచడానికి వాడవచ్చు. ఇంకా పలు విధాలైన వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు.

పవన విద్యుత్అనేది గాలినే ఇంధనంగా వాడుకుని ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తి. దీనిని విద్యుదుత్పాదనకు, బ్యాటరీ చార్జింగ్, నీటి పంపింగ్ మరియు పిండి మరకు వాడుకోవచ్చు. భారీ స్థాయిలో గ్రిడ్ విద్యుదుత్పాదనకు వీలుగా దగ్గర దగ్గరలోనే చాలా టర్బయిన్లను ఏర్పాటు చేస్తారు.

బయోమాస్ ఇంధనంఅనేది మొక్కలు, వ్యవసాయ, అటవీ వ్యర్థాలు మరియు మునిసిపల్, పారిశ్రామిక చెత్త ద్వారా తయారయ్యే విద్యుచ్ఛక్తి. ఉదాహరణకు, వేలాది ఏళ్లుగా చెక్కను వేడి నిమిత్తం వినియోగిస్తున్నాము.

జల విద్యుత్అనేది నీటి ప్రవాహంద్వారా తయారయ్యే విద్యుచ్ఛక్తి. భారీ, చిన్నతరహా జల విద్యుదుత్పాదనకు సాంకేతికత అందుబాటులో ఉంది.

జియో-థర్మల్ ఇంధనంఅనేది భూమి నుంచి వెలువడే ఉస్ణ వాయువులద్వారా సేకరించు విద్యుచ్ఛక్తి. భూమి ఉపరితలం నుంచి కొన్ని మైళ్ల దిగువన ఉష్ణ జలాలు, ఉష్ణ రాతిబండలను కనుగొనడమైంది.

సముద్ర ఇంధనంఅనేది రెండు విధాలైన శక్తి సూర్యునిద్వారా వెలువడే థర్మల్ శక్తి మరియు అలలు, తరంగాలు నుండి వెలువడే మెకానికల్ శక్తి.   భూ ఉపరితలం దాదాపు 70 శాతం సముద్రాలతో నిండి ఉంది. ప్రపంచంలోనే సౌరశక్తిని స్వీకరించే అతి పెద్ద కేంద్రాలు సముద్రాలు. సౌర శక్తి ద్వారా సముద్ర ఉపరితలంలోని జలాలు వేడెక్కుతాయి. సాగర అంతర జలాలకంటే ఇవి వేడిగా ఉంటాయి. ఉష్ణోగ్రతలోని ఈ తేడాద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

పునర్వినియోగ విద్యుత్కేంద్రాలు

(i) చిన్న తరహా

ఈ రకమైన RE వ్యవస్థలు లేదా ఉపకరణాలు భవంతులపై అమర్చబడి ఉంటాయి. చిన్న తరహా పునర్వినియోగ సాంకేతికత స్థానికంగా మరియు వికేంద్రీకృతమై ఉంటుంది. అనగా స్థానిక అవసరాలకోసం వినియోగించుకునేది. అపార్టుమెంట్లు, పారిశ్రామిక వాడ, రిక్రియేషన్ సెంటర్, పల్లె ప్రాంతాల్లో వెచ్చదనానికి లేదా శీతలీకరణకు విద్యుచ్ఛక్తిని వినియోగిస్తారు. చిన్న తరహా ఉత్పాదక వ్యవస్థలను (1) ఎలక్ట్రిసిటీ గ్రిడ్లో పొందుపరచడం (బౌతికంగా కనెక్ట్ చేయడంద్వారా, (2) జిల్లా హీటింగ్ మరియు/ లేదా కూలింగ్ నెట్వర్క్కి జత చేయడం లేదా (3) గ్రిడ్ వ్యవస్థతో సంబంధం లేకుండా దానంతట దానినే ఉపయోగించుకోవడం జరుగుతుంది.

a. రూఫ్ టాప్ సౌరశక్తి

రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ద్వారా పనిచేస్తాయి. వీటిని సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి భవనాల పైన అమర్చాలి.

b. చిన్న తరహా గాలి మరలు

’చిన్న తరహా గాలి మర‘ అనేది గృహావసరాలు లేదా చిన్నపాటి వ్యాపారానికి ఉపయోగపడే వ్యవస్థ. ఇవి 100KW కన్నా తక్కువగా విద్యుదుత్పాదన చేస్తాయి. సాధారణంగా వీటి స్థాయి 1-10KW నడుమ ఉంటుంది.

c. గృహావసర సోలార్ వాటర్ హీటర్లు

ఈ తరహా సోలార్ వాటర్ హీటర్ వ్యవస్థలను సాధారణంగా గృహావసరాలకు వేడి నీళ్లకోసం వినియోగిస్తారు. సోలార్ వాటర్ వ్యవస్థలలో భవనాలపైన అమర్చే రూఫ్-మౌంటెడ్ సోలార్ ప్యానెల్స్ ద్వారా పనిచేస్తాయి. సౌర శక్తిని గ్రహించి నీటిని లేదా ట్యాంకులలోని నీటిని వేడెక్కిస్తాయి. ఇవి సూర్యుడు కనిపించకుండా మేఘాలు కమ్ముకున్న సమయంలో పనిచేయడానికి అనువుగా గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ బూస్టర్ని కలిగి ఉంటాయి.

d. హీట్ పంపులు

హీట్ పంప్ టెక్నాలజీ అనేది మీకు అవసరం లేనిచోట నుంచి అనగా ఇల్లు లేదా మరెక్కడ నుంచయినా వేడిమిని గ్రహించి నీటిలోనికి మళ్లిస్తుంది. మీ ఇంటిలో లేదా బయటి వేడి వాతావరణంలోని అదనపు ఉష్ణోగ్రతను స్వీకరించి, సోలార్ హాట్ వాటర్ ప్రతిరూపంగా పనిచేస్తుంది.

e. వాణిజ్య పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు

సోలార్ థర్మల్ వ్యవస్థల్లో ఇది మరొకటి. దీనిని వాణిజ్య, చిన్నతరహా పారిశ్రామిక అవసరాలకు, అనగా ఆసుపత్రులు, లాండ్రీలు, పాఠశాలలు, బహుళ కుటుంబాలు నివసించే ప్రాంతాలలో వినియోగిస్తారు.

f. సోలార్ కూలింగ్ వ్యవస్థలు    

సోలార్ కూలింగ్ వ్యవస్థలు అనగా సౌర శక్తితో పనిచేసే ఎయిర్ కండిషన్ వ్యవస్థలు. ఇది సౌర శక్తి నుంచి విద్యుదుత్పాదన జరిపే సోలార్ థర్మల్ శక్తి మార్పిడి మరియు ఫోటోవాల్టాయిక్ మార్పిడి ద్వారా స్థిర సోలార్ వ్యవస్థతో పనిచేస్తుంది.

(ii) భారీ స్థాయి

RE వ్యవస్థలను విద్యుత్ గ్రిడ్కి విద్యుచ్ఛక్తిని అందించే విధంగా ఏర్పాటు చేయవచ్చు. ఇవి ప్రధానంగా ప్రైవేట్ పెట్టుబడులద్వారా పనిచేస్తాయి. గ్రిడ్తో అనుసంధానించే పునర్వినియోగ విద్యుత్కేంద్రాలు పవన విద్యుత్, బయోమాస్, సౌర శక్తి ఆధారితమైనవి (1 MW మించినవి) మరియు చిన్న తరహా జల విద్యుత్కేంద్రాలు (25 MW కంటే తక్కువ). రాష్ట్ర విద్యుత్ నియంత్రణాధికార కమిషన్ (SERC)లు నిర్ణయించిన టారిఫ్ విధానాలకు లోబడి ప్రైవేట్ రంగం వీటిని నిర్వహిస్తుంది.

(iii) మధ్య తరహా

a. కమ్యూనిటీ ఆధారితం – విద్యుత్ ఉత్పాదన వికేంద్రీకరణ (DDG)

DDG అనేది విద్యుచ్ఛక్తి వినియోగ ప్రాంతాలలో లేదా చేరువలో నెలకొల్పిన చిన్నతరహా, మాడ్యులర్, వికేంద్రీకృతమైన ఆఫ్-గ్రిడ్ వ్యవస్థలతో కూడినది. గ్రిడ్ పరిధిలో లేని (ఆఫ్-గ్రిడ్) గ్రామాలకు లేదా దూరంవల్లగానీ, కొండ ప్రాంతాలవల్లగానీ విద్యుత్ గ్రిడ్కు అనుసంధానంగా కాని ప్రాంతాలకు ఎంతో ఉపయుక్తమైనవి. ఇవన్నీ వాటంతట అవే పనిచేసే ఒంటరి వ్యవస్థలు కావడంతో స్థానికంగా ఉపాధి కల్పనకు, ఎక్కడికక్కడి చెత్త పునర్వినియోగానికి ఉపయోగపడతాయి. అలాగే మౌలిక సదుపాయాలపై స్థానిక అజమాయిషీకి, విద్యుత్ వినియోగానికి ఎంతో అనువైనవి.

DDG వ్యవస్థలు కేవలం ఒకే ఒక వనరుతో పనిచేసేవి (ఉదా: సెంట్రల్ విండ్ లేదా సౌరశక్తి). లేదా బహుళ (హైబ్రీడ్) వనరులు (ఉదా: పవన మరియు సౌర శక్తి సమ్మేళనంతో) పనిచేసేవిగా ఉంటాయి. DDG వ్యవస్థలు ప్రత్యామ్నాయ విద్యుచ్ఛక్తిని లేదా సంప్రదాయిక వ్యవస్థను మెరుగుపరచే విద్యుచ్ఛక్తిని సమకూరుస్తాయి. ఇవి వినియోగదారుడి తరఫున నెట్వర్క్కి జతపరచిన విద్యుచ్ఛక్తి ఉత్పాదక యూనిట్లు. వీటి వల్ల సరఫరా-పంపిణీ (T&D) నష్టాలు తక్కువగా ఉంటాయి.

RE ప్రాచుర్యానికి విధానాలు మరియు ప్రోత్సాహకాలు

(i) పునర్వినియోగ పోర్టుపోలియో ప్రమాణాలు (RPS)

RE ప్రాచుర్యం కోసం భారతదేశపు రాష్ట్రాలు RPS విధిస్తున్నాయి. వీటి కింద సాధారణంగా ఉండే RPS విధివిధానాలు a) విద్యుచ్ఛక్తిని సరఫరా చేసే కంపెనీలు కొంత నిర్దేశిత విద్యుత్ని విధిగా పునర్వినియోగ ఇంధన వనరులద్వారా ఉత్పత్తి చేయాలి మరియు b) విద్యుత్ పంపిణీ కంపెనీలు పునర్వినియోగ ఇంధన వనరుల నుంచి కొనుగోలు చేయాలి. దీనికోసం, గ్రిడ్కి అనుసంధానించే RE విద్యుచ్ఛక్తికోసం ముందస్తుగా నిర్ణయించిన మార్కెట్ రేట్లనే రాష్ట్ర విద్యుత్ నియంత్రణాధికార కమిషన్లు ఖాయం చేస్తున్నాయి. ఈ టారిఫ్లు పునర్వినియోగ విద్యుదుత్పాదకులు వినియోగించే వనరులనుబట్టి మారుతూ ఉంటాయి. 

(ii) పునర్వినియోగ ఇంధన సర్టిఫికేట్లు (RECs)

పునర్వినియోగ ఇంధనానికి మళ్లేందుకుగాను సర్టిఫికేట్లద్వారాకూడా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. వీటిని పునర్వినియోగ వనరులద్వారా విద్యుదుత్పాదనకు పాటించిన పర్యావరణ, సాంకేతిక పద్ధతులకు, మరియు భిన్నమైన విద్యుదుత్పాదనా విధానాలకు అందజేస్తారు. ఈ గుణాలన్నీ భౌతిక విద్యుచ్ఛక్తికి వినూత్నంగా ఉండాలి. వీటిలో ప్రథమంగా నిలిచినవాటికి REC జారీ చేయడమవుతుంది. తద్వారా సర్టిఫికేట్ మరియు విద్యుదుత్పాదన రెండూ అమ్మకానికి లేదా వ్యాపారానికి అందుబాటులో ఉంటాయి. ఒక RE సర్టిఫికేట్ విలువ పునర్వియోగ వనరులద్వారా జరిపిన 1MWh విద్యుదుత్పాదనగాపరిగణించాలి. RE సర్టిఫికేట్లను పొందడానికి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయదలచినవారు RE విద్యుచ్ఛక్తి వినియోగదారులు కానక్కరలేదు.

(iii) నికర లెక్కింపు

గ్రిడ్కికూడా ఫీడ్ అందించే పునర్వినియోగ ఇంధన విద్యుచ్ఛక్తిని (ఉదాహరణకు, సోలార్ ఫొటోవాల్టాయిక్ ప్యానల్స్ లేదా గాలి మరలద్వారా) నికర లెక్కింపు(నెట్ మీటరింగ్) వ్యవస్థ ప్రోత్సహపరుస్తుంది. గ్రిడ్కి అందజేసే విద్యుచ్ఛక్తి మొత్తానికిగాను ఉత్పాదకులు పరిహారం పొందగలుగుతారు. నెట్ మీటరింగ్ వ్యవస్థ ద్వారా తాము ఉత్పత్తి చేసిన విద్యుచ్ఛక్తిని సదరు ప్రాంతంలో ఎంత వాడుకున్నదీ మరియు గ్రిడ్కి ఎంత మేర అందజేశామన్నదీ ఉత్పాదకుల యొక్క ఎలక్ట్రిక్ మీటర్లు లెక్క తేలుస్తాయి. ఆన్-సైట్ అవసరాలకు చాలని పక్షంలో గ్రిడ్ నుంచి విద్యుచ్ఛక్తిని వాడుకోవడానికి వీలవుతుంది.

(iv) స్వేచ్ఛా వినియోగం

స్వేచ్ఛా వినియోగం (ఓపెన్ యాక్సెస్)ద్వారా అందరూ, ముఖ్యంగా 1 మెగావాట్ (Mw) కంటే అధిక లోడ్ వినియోగదారులు బహిరంగ మార్కెట్లో లేదా పునర్వినియోగ ఇంధన వనరుల నుంచి చౌక ధరకి విద్యుచ్ఛక్తి కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుంది. ఓపెన్ యాక్సస్ వినియోగదారులు లైన్లు వాడుకున్నందుకుగాను సరఫరా మరియు పంపిణీ (T&D) నెట్వర్క్ లైసెన్స్దారులకు జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడంకోసం సర్చార్జిని మరియు పేమెంట్ని పొందడానికి విద్యుత్ చట్టం-2003 అనుమతిస్తుంది. ఇది విద్యుచ్ఛక్తి రంగంలో గుత్తాధిపత్యాన్ని నిరోధించడంకోసం తీసుకున్న నిర్ణయం. దీనివల్ల పెద్ద సంఖ్యలోగల విద్యుత్ కంపెనీలలో తమకు అనువైనదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కలుగుతుంది. భారీ మొత్తంలో విద్యుచ్ఛక్తిని వినియోగించేవారికి ముఖ్యంగా టెక్స్టైల్, సిమెంట్ స్టీల్ యూనిట్లవారికి ఎంతో సౌకర్యం. తమకు చౌక ధరలో నిరంతర విద్యుచ్ఛక్తి అందడానికి, తద్వారా విద్యుత్ కంపెనీల వ్యాపారం పెరగడానికికూడా ఉపయోగపడుతుంది.

(v) సబ్సిడీలు

అభివృద్ధికోసం గ్రాంట్లు, రిబేట్లు, పన్ను రాయితీలు వంటి ఆర్థిక ప్రోత్సహాకాలను కేంద్ర నూతన మరియు పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలద్వారా అందజేస్తుంది.

(vi) ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (GBI)

గ్రిడ్కి అనుసంధానించిన పవన మరియు సౌర శక్తి ప్రాజెక్టులద్వారా అదనపు విద్యుదుత్పాదన సాధించడానికిగాను భారత ప్రభుత్వం ఉత్పత్తి ఆదారిత ప్రోత్సాహకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద, గ్రిడ్కి అందజేసిన విద్యుచ్ఛక్తికిగాను పవన మరియు సౌర శక్తి ఉత్పాదకులకు చెల్లించే ఫీడ్-ఇన్ టారిఫ్లకు అదనంగా ఆర్థిక ఫ్రోత్సాహకాలు అందుతాయి. ఈ స్కీమ్ కింద గ్రిడ్కి 4 సంవత్సరాల కాలపరిమితి తక్కువగాకుండా విద్యుచ్ఛక్తి అందాలి. గ్రిడ్కి అందించే విద్యుత్ యూనిట్ ఒక్కంటికీ 0.50 పై.ల చొప్పున GBI ఉంటుంది. మొత్తం మీద పదేళ్ల వ్యవధిలో గరిష్టంగా MW ఒక్కంటికీ కోటి రూ.ల చొప్పున ఉంటుంది.

(vii) త్వరితగతి తరుగుదల

త్వరితగతి తరుగుదల అనేది కంపెనీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదా పన్నుల నిమిత్తంగల పలు పద్ధతుల్లో ఏదోక దానిద్వారా స్థిరాస్తుల తరుగుదలను చూపిస్తుంది. ఏటా లెక్కించే ఈ తరుగుదల తొలినాళ్లలో అధికంగా ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ నిమిత్తం తొలి ఏడాదుల్లో అధికోత్పత్తి అంచనా వేసి, ఏటా అస్సెట్ యొక్క వినియోగం ఏ మేరకు జరుగుతుందో నిక్కచ్చిగా తీస్తారు. పన్ను ప్రయోజనాల నిమిత్తం, త్వరితగతి తరుగుదలను ప్రస్తుత సంవత్సరాలలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించి చూపడం ద్వారా కార్పొరేట్ ఆదాయ పన్నులలో వ్యత్యాసాన్ని చూపిస్తారు. ఇందుకు ప్రతిగా, రాబోయే సంవత్సరాలలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పెంపు ఉంటుంది. ఇది వాణిజ్యవేత్తలు నూతన ఆస్తులు సమకూర్చడానికి వీలుగా కల్పించే విలువైన పన్ను ప్రోత్సాహకం.

సౌర విద్యుదుత్పానకు విషయంలో, వాణిజ్యవేత్తలను సౌర విద్యుదుత్పాదన రంగంలో ప్రోత్సాహపరచడానికిగాను ప్లాంట్ పనిచేయడం ఆరంభించిన తొలి ఏడాదిలోనే 80% తరుగుదల తీయడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుంది.

విద్యుత్ రంగంలో పునర్వినియోగ ఇంధన చట్టం-2003, జాతీయ విద్యుచ్ఛక్తి విధానం-2003 మరియు జాతీయ టారిఫ్

విద్యుచ్ఛక్తి చట్టం-2003

ఉపోద్ఘాతం (పేజీ నెం.-1)

 ’’విద్యుదుత్పాదన, సరఫరా, పంపిణీ, వాణిజ్యం మరియు విద్యుచ్ఛక్తి వినియోగం, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన సాధారణ చర్యలు, …..సమర్థవంతమైన మరియు పర్యావరణహితమైన విధానాలను ప్రచారం చేయడానికి… సంబంధించిన చట్టాలను సమీకృతం చేసిన చట్టం‘‘.

పునర్వినియోగ ఇంధన ప్రాచుర్యానికిగల నియంత్రాణాదేశాలు

సెక్షన్ 2(47) ’’సంబంధిత కమిషన్ ద్వారా నిర్దేశించబడిన నిబంధనలకు అనుగుణంగా విద్యుదుత్పాదనలోగల వ్యక్తి లేదా వినియోగదారుడు లేదా ట్రాన్స్మిషన్ లైన్లు లేదా పంపిణీ వ్యవస్థ లేదా అటువంటి లైన్లకు అనుబంధమైన సదుపాయాలు లేదా వ్యవస్థకు సంబంధించిన లైసెన్స్దారులందరూ నిరభ్యంతరంగా వినియోగించుకోవడానికి ఉద్దేశించిన నాన్-డిస్క్రిమినేటరీ ప్రొవిజన్‘‘.

విద్యుత్ చట్టం-2003 యొక్క సెక్షన్ 86(1) (e) ప్రకారం పునర్వినియోగ ఇంధన వనరులద్వారా విద్యుదుత్పాదన మరియు సహఉత్పాదనకు రాష్ట్ర కమిషన్ విధిగా ప్రోత్సహించాలి. ఇందుకుగాను గ్రిడ్కి అనుసంధానానికి, విద్యుచ్ఛక్తిని ఎవరికైనా అమ్ముకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. ఆయా ప్రాంతాల్లో వినిమయమయ్యే మొత్తం విద్యుచ్ఛక్తిలో కొంత శాతాన్ని ప్రత్యామ్నాయ విద్యుదుత్పాదన వనరుల నుంచి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్దారుడు కొంత శాతాన్ని కొనుగోలు చేసేలా చూడాలి.

సెక్షన్ 51 (h) ప్రకారం సంబఁధిత కమిషన్ విధిగా, .., టారిఫ్కి సంబంధించిన నియమ నిబంధనలు స్పష్టం చేయాలి. మరియు దిగువన పేర్కొన్న విధంగా మార్గదర్శనం సూచించాలి: …………………………………………………………………………………………………………

(h) పునర్వినియోగ వనరులద్వారా విద్యుదుత్పాదన మరియు సహఉత్పాదన ప్రాచుర్యం,

(i) జాతీయ విద్యుచ్ఛక్తి విధానం మరియు టారిఫ్ పాలసీ

జాతీయ విద్యుచ్ఛక్తి విధానం ఉత్పాదన మరియు సహఉత్పాదన

“5.2.20 అదనపు విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని కల్పించడంద్వారా సంప్రదాయేతర ఇంధన వనరులైన చిన్న తరహా హైడ్రో, విండ్, బయోమాస్ విద్యుత్కేంద్రాల నుంచి సాధ్యమైనంత సంభావ్య విద్యుచ్ఛక్తిని పొందవచ్చు. విద్యుచ్ఛక్తి రంగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాని పెంచాలన్న దృక్పథంతో తగిన ప్రోత్సాహక చర్యలద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి‘‘.

జాతీయ టారిఫ్ పాలసీ

 

6.4 ’’విద్యుచ్ఛక్తి ధర విషయంలో సంప్రదాయ వనరులతో పోల్చినప్పుడు సంప్రదాయేతర వనరుల పరిజ్ఞానం అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల సంబంధిత కమిషన్ నిర్దేశించిన టారిఫ్ల ప్రకారంగా పంపిణీ సంస్థలు విద్యుచ్ఛక్తిని సేకరించాలి.

(2) భవిష్యత్ అవసరాల నిమిత్తం… ఒకే విధమైన సంప్రదాయేతర వనరుల నుంచి ఉత్పత్తయిన విద్యుచ్ఛక్తిని పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పంపిణీ సంస్థలు సేకరించాల్సి ఉంటుంది...”

RE ప్రాచుర్యానికి సంస్థలు

సంస్థ

ఉద్దేశం

వివరాలు

చిరునామా

నూతన మరియు పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE)

నూతన మరియు పునర్వియోగ ఇంధనానికి సంబంధించిన అన్ని అంశాలపై భారత ప్రభుత్వపు నోడల్ మంత్రిత్వ శాఖ

గ్రామీణ, పట్టణ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వినియోగార్ధం నూతన మరియు పునర్వినియోగ ఇంధన వ్యవస్థలు లేదా పరికరాల తయారీకి పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, తయారీ, రవాణా, ఏర్పాటు నిమిత్తం వీలు కల్పించాలి.

బ్లాక్-14, CGO కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూఢిల్లీ-110 003, ఇండియా.
టెలిఫోన్:  +91-11-24362772
ఈమెయిల్: secy-mnre@nic.in

 

భారత పునర్వినియోగ ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్(IREDA)

పునర్వియోగ ఇంధనం మరియు ఇంధన సమర్థత పర్యావరణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయ కల్పన, అభివృద్ధి మరియు ప్రచారం

నూతన మరియు పునర్వనియోగ వనరులద్వారా విద్యుదుత్పాదన మరియు లేదా ఇంధన అఁభివృద్ధి నిమిత్తం సంబంధిత ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు కల్పించాలి.

3వ అంతస్తు, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాయిజీ కామా ప్లేస్,
న్యూఢిల్లీ – 110 066.
టెలిఫోన్: +91 11 26717400 - 413
ఫ్యాక్స్ : +91 11 26717416
ఈమెయిల్: cmd@ireda.gov.in

పునర్వినియోగ ఇంధన అభివృద్ధి ఏజెన్సీies

 

 

RE ప్రాచుర్యంకోసం రాష్ట్ర నోడల్ ఏజెన్సీ తరహాలో కార్యకలాపాలు

 

తన నిర్దేశిత పాలసీకి మరియు రాష్ట్ర పాలసీకి అనుగుణంగా MNRE అజమాయిషీలో పనిచేస్తుంది.

నూతన మరియు పునర్వినియోగ ఇంధన వనరులకు ప్రాచుర్యం కల్పించడం మరియు ప్రాజెక్టులను అమలు చేయడం

విద్యుత్ పొదుపు చర్యలకు ప్రాచుర్యం కల్పించడం

పునర్వినియోగ ఇంధన వనరుల పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం

తమిళనాడు ఇంధనాభివృద్ధి సంస్థ
E.V.K సంపత్ మాళిగై, 5అంతస్తు, నెం.68, కాలేజీ రోడ్, చెన్నై-600 006
టెలిఫోన్: (044) 28224830  & 28236592
ఫ్యాక్స్: 2822 2971
ఈమెయిల్: info@teda.in

 

కర్ణాటక పునర్వినియోగ ఇంధనాభివృద్ధి సంస్థ
నెం.39,’శాంతిగృహ‘, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బిల్డింగ్, ప్యాలెస్ రోడ్,
టెలిఫోన్: (080)22207851/22208109/9480691041.
ఫ్యాక్స్:080-22257399
ఈమెయిల్: kredlnce@yahoo.co.in

 

కేరళ సంప్రదాయేతర ఇంధనం మరియు గ్రామీణ సాంకేతిక సంస్థ
పోలీస్ పరేడ్ గ్రౌండ్, తైకాడ్,
తిరువనంతపురం – 695014.
టెలిఫోన్: (0471)2329854, 2338077, 2334122, 2333124 &2331803
ఫ్యాక్స్:  (0471)2329853
ఈమెయిల్: director@anert.in

 

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర ఇంధనాభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ [NEDCAP]
5-8-207/2, పాయెగా కాంప్లెక్స్, నాంపల్లి, హైదరాబాద్ - 500 001.
ఫోన్: (040)2320 2391
ఫ్యాక్స్: (040)23201666
ఈమెయిల్: info@nedcap.gov.in, nedcap@ap.nic.in

రాష్ట్ర విద్యుత్ నియంత్రాణాధికార కమిషన్

విద్యుత్ చార్జీల హేతుబద్ధీకరణ, సబ్సిడీ సంబంధిత అంశాలపై పారదర్శకత, సమర్థవంతమైన మరియు పర్యావరణ హితమైన విధానాల అభివృద్ధి, తత్సంబంధమైన అంశాలపై సమయానుసార నిర్ణయాలకోసం.

సెక్షన్ 84 (1) (e) ప్రకారం విద్యుత్ నియంత్రణాధికార కమిషన్ పునర్వినియోగ ఇంధనాన్ని విధిగా ప్రమోట్ చేయాలి.

తమిళనాడు:
నెం. 19ఎ, రుక్మిణీ లక్ష్మిపతి సాలై, ఎగ్మోర్, చెన్నై - 600 008.
టెలిఫోన్: (044) 28411376, 28411378, 28411379
ఫ్యాక్స్:(044) 28411377.
ఈమెయిల్: tnerc@nic.in
కర్ణాటక:
6వ అంతస్తు, మహాలక్ష్మీ చాంబర్స్, # 9/2, ఎం.జి.రోడ్, బెంగళూరు - 560 001
ఫోన్: (080) 25320213 / 214, 25320339, 25323765
ఫ్యాక్స్: 080-25320338,
ఈమెయిల్: kerc35@bsnl.in

 

ఆంధ్రప్రదేశ్:
4th & 5th Floors, 11-4-660,
సింగరేణి భవన్, రెడ్ హిల్స్,
హైదరాబాద్- 500 004
ఫోన్: (040) 23397381
ఫ్యాక్స్: (040) 23397378 & 23397489
ఈమెయిల్: chmn@aperc.gov.in 

 

కేరళ:
కె.పి.ఎఫ్.సి.భవనం, సి.వి.రామన్ పిళ్లై రోడ్, వెళ్లయాంబళమ్, తిరువనంతపురం
కేరళ-695010
ఫోన్: (0471) 2735544
ఫ్యాక్స్: 0471) 2735599
ఈమెయిల్: kserc@erckerala.org